రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

-

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న పుస్తకాల్లోని ముందుమాట పేజీలో రాష్ట్ర సీఎంగా కేసీఆర్ పేరు ముద్రించి ఉండటంతో ప్రభుత్వం బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో అధికారులు ముందు మాట పేజీని చించివేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కేసీఆర్ పేరు ఉందని పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా వెనక్కి తీసుకోవడంపై బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని వెనక్కి తీసుకోవడం బాధకరమని అన్నారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తే ప్రజలపైనే భారం పడుతోందని, వ్యక్తిగత కారణాలతో ప్రజాధనం వృధా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్ పేరు ఉన్న పుస్తకాలు యధావిధిగా విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. పక్క రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయినప్పటికీ స్కూల్ బ్యాగులపై జగన్ ఫొటో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అలాగే పంపిణీ చేస్తోందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news