ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు – జగన్

-

వైసీపీ ఎంపీల సమావేశంలో వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని వైసీపీ ఎంపీలకు ధైర్య నూరిపోసారు. మనలో పోరాటపటిమ తగ్గకూడదని సూచనలు చేశారు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదని… 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందన్నారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు….లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు.

 

CM Jagan’s sensational announcement on Land Titling Act

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని అడుగులు ముందుకేయాలని… పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోండని పేర్కొన్నారు. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి….మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయని చెప్పారు. వైసీపీ పార్టీ కోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందని దిశా నిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news