తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లాడు : ఎమ్మెల్యే పార్థసారథి

-

కృష్ణా జిల్లా పామర్రు మార్కెట్ యార్డ్ లో పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే ఏపీ సారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లాడు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నాడన్నారు. ఈరోజు నీటి కొంత ఇబ్బంది వస్తే తెలుగుదేశం పార్టీ వారు దానిని పండగ చేసుకుంటున్నారని మేము రైతుల పరామర్శించడానికి వెళ్తున్నారని అనుకుంటున్నాం… వారు పరామర్శించడం లేదు.. వరి పంట ఎప్పుడు చచ్చిపోతుందా… రైతు ఎప్పుడు ఏడుస్తారు అని చూస్తున్నారని వ్యంగంగా మాట్లాడారన్నారు.

అంతేకాకుండా..’14 ఏళ్లలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు వేల టీఎంసీల గోదావరి, కృష్ణా నదుల్లో నీరు సముద్రంలోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు. ఆనాడు బంటుమిల్లిలో 10 ఎకరాల రైతు కూడా కూలినాలి చేసుకుని బతికేందుకు సిటీకి వలస పోతుంటే .. వృధాగా పోయే నీటిని పొలాలకు మల్లింపచేయాలని ఆలోచన ఆనాడు చంద్రబాబు కి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కృష్ణాజిల్లా సంజీవిని లాంటి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేయమని ఈ రాష్ట్ర ప్రజలు దశబ్దం పాటు పోరాటం చేస్తే ఆనాడు తెలంగాణలో ఎమ్మెల్యే అడ్డుపడ్డారని.. ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి అని పక్కనపెట్టిన వ్యక్తి చంద్రబాబు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలకు ముప్పావుల రూపాయికి రుణాలు ఇచ్చే వారిని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించారన్నారు. 2019 ఏప్రిల్ 13 నాటికి 25 వేల కోట్ల అప్పు ఉంటే దాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పాము.. ఎప్పటికీ చేసాం.. ఎవరైనా రాళ్లదని అడిగితే సమాధానం చెబుదాం.. చెప్పింది చేతి మీద మాత్రం గొప్పతనం అన్నారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version