మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమాలు రాకూడదనే సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు దృష్టి పెట్టారని రోజా తెలిపారు. అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే, అందరికీ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ బిల్లు పెట్టారని, రాజధాని రైతులకు ఏ విధంగా నష్టం జరగదని ప్రకటించారు రోజా. ఈ రోజు సంతోషంగా లేకుండా ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబునాయుడు నారా లోకేష్ అండ్ కో బ్యాచ్ అని విమర్శించారు.
గతంలో అధికారాన్ని ఒక చోట వికేంద్రీకరణ చెయ్యటం వల్ల తెలంగాణ, ఆంధ్ర విడిపోయాక దిక్కులేని పరిస్థితి లో పడ్డామని.. కానీ, జగన్ నిర్ణయంతో భవిష్యత్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొనియాడారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ లు ఏడుపు ముఖాలు వేసుకుని ఇంట్లో ఉండాలని అలా కాకుండా బయటకు వచ్చి అభివృద్ధి ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఉరుకోరని హెచ్చరించారు.