షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఒక్కేరోజు భారీగా..!

-

బంగారం ధరలు అల్ టీం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే కదులుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న బంగారం ఈరోజు మరికాస్త పెరిగింది. అలాగే నిన్న బాగా తగ్గిన వెండి ఈరోజు మళ్ళీ అమాంతం పెరిగిపోయింది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.220 పైకి కదిలింది. దీంతో ధర రూ.55,820కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి.

అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరుగుదలతో రూ.51,250కు ఎగసింది. ఇక వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.2000 పెరిగింది. దీంతో ధర రూ.65,000కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. రూ.52,200కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.200 పెరుగుదలతో రూ.53,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 పెరుగుదలతో రూ.65,000కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news