ఆర్ ఆర్ ఆర్ టీజర్ పై ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు..

ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న ఎదురుచూపులకి ఈ రోజు ఫలితం దక్కింది. అభిమానుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ లుక్ టీజర్ రిలీజైంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో గాండ్రించే బెబ్బులిలా ఎన్టీఆర్ కనిపించాడు. ఒక్కసారిగా కొమరం భీమ్ పాత్రలో చూసేసరికి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.

అటు అభిమానుల నుండే కాదు సినిమా సెలెబ్రిటీల నుండి రాజకీయ నాయకుల నుండి కూడా ఈ టీజర్ పై ప్రశంసలు వచ్చాయి. ప్రముఖ తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క ఆర్ ఆర్ ఆర్ టీజర్ పై ప్రశంసలు కురిపించారు. కొమరం భీమ్ జయంతిన నివాళులు అర్పిస్తూ.. కొమరం భీమ్ ఒక పాత్రగా కనిపిస్తున్న ఆర్ ఆర్ ఆర్ టీజర్ బాగుందని చెప్తూ చిత్ర దర్శకులు రాజమౌళి, హీరో ఎన్టీఆర్ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు.