దేశంలో మొదలయిన వ్యాక్సిన్ రాజకీయం

-

దేశంలో ఒక్క సారిగా రాజకీయాలు వ్యాక్సిన్ వైపు మళ్ళాయి. బిజెపి బీహార్లో అందరికీ ఉచిత వ్యాక్సిన్ హామీ ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ హామీ మీద ప్రతిపక్షాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకం అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు ? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని ఆయన ప్రశ్నించారు. రాని వ్యాక్సిన్ ని ఉచితంగా ఇస్తామని ఎలా చెప్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశం మీద అ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ సిద్ధమయ్యారు. బీహార్ లో పంచాడానికి బిజెపి డబ్బులు కడుతోందా ? లేక కేంద్రమా అని ఆయన ప్రశ్నించారు.

అలానే బీహార్లో ఉచితంగా ఇస్తే మరి దేశమంతా ఎవరిస్తారు అని ఆయన ప్రశ్నించచారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తే అప్పుడు బీహార్లో ఉచితంగా పంచి పెడతామని బిజెపి కవర్ చేసుకుంటుంది. ఇదే ఫార్ములా తమిళనాడు పాలిటిక్స్ లోనూ ఎంటర్ అయింది. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇక అమెరికా ఎన్నికల్లోనూ ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ కనబడుతోంది. అన్ని దేశాల వారికంటే ముందే అమెరికన్లకు వ్యాక్సిన్ ఇస్తామని అని ట్రంప్ చెబుతున్నారు.ఈ విషయం మీద ఆయన ప్రత్యర్థి కూడా వర్షం కురిపిస్తున్నారు అసలు మార్కెట్ లోకి రాని వ్యాక్సిన్ అమెరికన్లకు పంచి పెడతానని ఇలా చెబుతున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news