వ్యవసాయ చట్టాల గురించి జరుగుతున్న నిరసనలు తెలిసిందే. 80రోజులుగా రైతులందరూ కలిసి ఢిల్లీ వేదికగా వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని, తక్షణమే రద్దు చేయాలని, అందులో మరో విషయమే ఉండవద్దు అన్నట్టుగా, కేంద్ర చర్చలు జరిపి అందులో మార్పులు తీసుకువస్తామని చెప్పినా వినకుండా, రైతులకి నష్టం కలిగించే చట్టాలు అక్కరలేదని చెప్తూ రద్దు చేయాలని నిరసన కార్యక్రమం జరుపుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది.
ఈ నిరసనకి చాలా మంది తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇతర దేశాల సెలెబ్రిటీలు సాగు చట్టాలపై తమ గొంతు వినిపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ ఎమ్మెల్యే ఇందిరా మీనా వినూత్న రీతిలో సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేసారు. అసేంబ్లీ సమావేశాలకు ట్రాక్టర్ మీద వచ్చి, తన నిరసనని తెలియజేసారు. ఎన్నో రోజులుగా రైతులు చేస్తున్న నిరసనని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించింది.