మహిళా వాలంటీర్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు..!

-

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన వ్యవహారాలు ఇప్పటికీ అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో వాలంటీర్లు అధికార పార్టీ కోసం పని చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వాలంటీర్ ను ఫోన్ లో దుర్భాషలాడటం సంచలనంగా మారింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే మహిళా వాలంటీర్ మీద గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి మహిళా వాలంటీర్ సపోర్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరపల్లి లో ఉన్న తన క్యాంపు ఆఫీస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆమెను ఆదేశించారు. ఇక ఆయన అనుచిత వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Read more RELATED
Recommended to you

Latest news