అధికార పార్టీ ఎమ్మెల్యేలు మూసుకోండి.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో గవర్నర్ ప్రసంగం పై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరుపున మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని పేర్కొన్నారు. నేను రైతుల గురించి మాట్లాడుతున్నాను.. మీలా కమిషన్ల గురించి మాట్లాడటం లేదు.  రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడ ఇచ్చారు అని ప్రశ్నించారు. గవర్నర్  ప్రసంగం చదివేటప్పుడు గవర్నర్ మనసు ఎంత నొచ్చుకొని ఉంటుందో అన్నారు.

ముఖ్యంగా  అధికార పార్టీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ మానుకోవాలి.. మూసుకోండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు జగదీశ్ రెడ్డి. మహిళలకు స్కూటీలు ఇచ్చారా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు జగదీష రెడ్డి. రైతుల గురించి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. 25 వేల రుణమాఫీ చేస్తే జగదీశ్ రెడ్డి కండ్లకు కనపడకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. నాలుగు బర్రెల కథ చెప్పడం విడ్డూరం అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version