సుచరిత ఇంటి వద్ద శ్రీదేవి ధర్నా..డొక్కా ఆసక్తి కర వ్యాఖ్యలు

-

తాడికొండ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి… మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కామెంట్స్ చేశారు. తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి… తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందన్నారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టానికి కృషి చేస్తా… రెండు రోజుల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలుస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే శ్రీదేవి బాగా తెలిసిన వ్యక్తి అని.. రెండు మూడు సమావేశాలతో అంతా సర్దుకుంటుందని వెల్లడించారు. పార్టీలో విబేధాలు లేవు… ఇప్పుడు మాట్లాడేవారు కూడా మా పార్టీవారేనని.. నిన్న మాట్లాడినవారిలో కొంతమంది వచ్చి కలిశారన్నారు.

ప్లీనరీ తర్వాత పార్టీ పటిష్టంపై సీఎం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని… త్వరలో సీఎం జగన్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నాపై మాట్లాడేవారు నన్ను కలిస్తే క్లారిటీ ఇచ్చేవాడిని… వివాదాలకు తావేలేదు.. తాడికొండనుంచి పోటీపై ఇప్పటివరకూ చర్చలు జరగలేదని తెలిపారు. నియోజకవర్గంలో నాకున్న పరిచయాలతో పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news