తాడికొండ వైసీపీ వివాదాల వెనుక ఆ ఎమ్మెల్సీ హస్తం…!

-

గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య కొన్నాళ్లు వైరం నడిచింది. పార్టీలో పెద్ద దుమారం రేపాయి. నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు ప్రజాప్రతినిధులు రాజీకొచ్చేశారు. వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో తాడికొండలో కొత్త కథ మొదలైంది.

ఎంపీ, ఎమ్మెల్యే కలిసిపోతే తన సంగతేంటని మరో నాయకుడు రంగంలోకి దిగారు.టీడీపీ నుంచి వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సైతం తాడికొండ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. దీనికి ఇటీవల తాడికొండలో జరిగిన పరిణామాలను ఉదహరణగా చెబుతున్నారు పార్టీ నాయకులు. ఎమ్మెల్యే శ్రీదేవికి ఒకప్పుడు ఆమెకు ముఖ్య అనుచరులుగా ఉన్న వారికి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం నడుస్తోంది. పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవలు సద్దుమణిగిన తర్వాత ఈ గొడవలేంటని ఆరా తీశాయట పార్టీ వర్గాలు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ జోక్యం వల్లే వివాదాలు తెరమీదకు వస్తున్నాయని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి తన కుమార్తెను పోటీ చేయించేందుకే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని డొక్కా దువ్వుతున్నారని అనుకుంటున్నారట. దీనిపై నియోజకవర్గ ప్రజల్లోనూ.. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో డొక్కా పేరును ప్రస్తావించకుండా.. ఆయన్ని టార్గెట్‌ చేస్తూ.. తాతయ్యా అంటూ సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంఛార్జ్‌గా రావాలంటే కష్టపడాలి కానీ… ఎమ్మెల్యే, ఎంపీలపై వారెవరితో మొరిగించడం కాదని డొక్కాపై పరోక్ష దాడి మొదలుపెట్టిందంట ఎమ్మెల్యే వర్గం.దీంతో ఇప్పటి వరకు ఉన్న రెండు స్దంబాలు నియోజకవర్గంలో కలసి పని చేసుకోవాలని నిర్ణయిస్తే ఇప్పుడు మరో పోల్ సెంటర్ కూడ రాజదాని నియోజవర్గంలో తెర మీదకు రావటం చర్చనీయాంశంగా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news