జగిత్యాల పట్టణ తెలంగాణ చౌరస్తా లో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్

-

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అతి త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 27వ తేదీన… కెసిఆర్ సభ కూడా నిర్వహించబోతున్నారు. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి ప్రాంతంలో దాదాపు పదిలక్షల మందితో కేసీఆర్ సభ ఉండనుంది. గులాబీ పార్టీ స్థాపించి సిల్వర్ జూబ్లీ అయిన నేపథ్యంలో… ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు కానుంది.

MLC’s Kavitha wall writing at Telangana Square in Jagtial town

ఈ నేపథ్యంలోనే… ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఇక తాజాగా కల్వకుంట్ల కవిత కూడా జగిత్యాల పట్టణంలో జన సమీకరణ కోసం తిరుగుతున్నారు.జగిత్యాల పట్టణ తెలంగాణ చౌరస్తా లో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్ చేయడం జరిగింది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు ఇంటికొక్కరు తరలి రావాలని పిలుపుచ్చారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news