సున్నితమైన మనస్సున్న వారు ఇది చదవకండి.. ప్లీజ్‌..!

-

ప్రకృతిలో జీవాలన్నింటికీ శృంగార కాంక్ష ఉంటుంది. అది ప్రకృతి సహజసిద్ధమైన ధర్మం. దాన్ని కాదనలేం. పార్ట్‌నర్‌తో శృంగారం దొరకనప్పుడు స్వయం సంతృప్తి మార్గాలు కూడా ఉన్నాయి. అంత వరకు ఓకే.. కానీ ఆ వ్యక్తి మాత్రం మరీ జుగుప్సాకరమైన రీతిలో స్వయం సంతృప్తికి యత్నించాడు. చివరకు తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడిపోయాడు. ఎట్టకేలకు హాస్పిటల్‌కు వెళ్లడంతో వైద్యులు సర్జరీ చేసి అతని సమస్యను పరిష్కరించారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

అస్సాంకు చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తి తనకు తీవ్రమైన కడుపునొప్పి ఉందని, మొబైల్‌ చార్జర్‌ కేబుల్‌ను ప్రమాదవశాత్తూ మింగానని చెబుతూ హాస్పిటల్‌కు వచ్చాడు. అయితే డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు కానీ.. ఆ నొప్పికి కారణం తెలియలేదు. అలాగే ఆ మొబైల్‌ చార్జర్ కేబుల్‌ కూడా ఎక్స్‌రేలు, స్కానింగ్‌లో కనబడలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు మరోసారి అతనికి క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. దీంతో అతని మూత్రాశయంలో సదరు కేబుల్‌ ఉన్నట్లు ఎక్స్‌-రేలో నిర్దారించారు. ఈ క్రమంలో అతనికి వైద్యులు సర్జరీ చేసి సమస్య నుంచి అతన్ని గట్టెక్కించారు.

mobile charger cable found in mans bladder

అయితే ఆ వ్యక్తికి ఇలాంటి చిత్రమైన వస్తువులతో స్వయం సంతృప్తి పొందే అలవాటు ఉందట. అలా అని చెప్పి అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఏమీ కాదు. అందరిలా మామూలు మనిషే. కానీ ప్రవర్తనే కొంచెం తేడా అన్నమాట. ఈ క్రమంలోనే అతను తన అంగం ద్వారా సదరు కేబుల్‌ను లోపలికి చొప్పించుకుని స్వయం సంతృప్తి పొందాలని చూశాడు. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. ఆ కేబుల్‌ కాస్తా మూత్రాశయంలోకి వెళ్లిపోయింది. దీంతో అతనికి తీవ్రమైన బాధ కలిగింది. అంతటి బాధ ఉన్నా అతను 5 రోజుల పాటు అలాగే ఉన్నాడు. ఇక బాధ భరించలేకపోవడంతో ఎట్టకేలకు హాస్పిటల్‌కు వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. కానీ విషయం తెలిస్తే ఏమవుతుందో.. తన గురించి ఏమనుకుంటారో అని భావించిన అతను కేబుల్‌ను మింగానని వైద్యులకు అబద్ధం చెప్పాడు. ఫలితంగా ఓ దశలో వైద్యులకు ఏమీ తెలియలేదు. అయినప్పటికీ వారు ఆ సమస్యను కనిపెట్టి సర్జరీ చేయడంతో అతను బతుకు జీవుడా.. అంటూ గండం నుంచి బయటపడ్డాడు. అందుకే మరి.. డాక్టర్లకు, లాయర్లకు అబద్దాలు చెప్పకూడదనేది.. ఏది ఏమైనా.. ఆ వ్యక్తి చేసిన పనిమాత్రం అత్యంత జుగుప్సాకరంగా అనిపిస్తోంది. సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా..? అని ఇప్పుడే తెలిసింది..!

Read more RELATED
Recommended to you

Latest news