‘సోలో బ్రతుకే సో బెటర్’ రిజల్ట్ డిసైడ్ చేస్తుందా .. మరి అప్పటి వరకు ..?

-

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ కూడా కమర్షియల్ గా మంచి హిట్ ని అందుకుంది. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేశాడు. ఈ ఊపుతోనే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి ‘సోలో బ్రతుకే సో బెటర్’ కాగా మరొకటి దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కే సినిమా.

 

ఇక ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మధ్యనే ఈ సినిమా లోని నో పెళ్ళి అన్న సాంగ్ ని రిలీజ్ చేశారు. సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ నభా నటేష్ లతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి కూడా కనిపించి సందడి చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్ఠిస్తోంది. ఒక్క మెగా ఫ్యాన్స్ నుంచే కాదు ప్రేక్షకులందరి నుంచి విపరీతమైన రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే సాయి ధరమ్ తేజ్ దేవ కట్టా సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవంగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయితే దేవ కట్టా కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క భారీ సక్సస్ కూడా లేకపోవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే పెద్దగా పాజిటివ్ బజ్ క్రియోట్ అవలేదు. దాంతో దేవ కట్టా తో సినిమా మొదలు పెట్టాలంటే సాయి ధరమ్ తేజ్ కాస్త ఆలోచనలో పడ్డాడట. దీంతో ఈ సినిమాను ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫలితం చూసిన తర్వాతే మొదలుపెట్టాలని దేవ కట్టాకు తేజు నిర్మొహమాటంగా చెప్పినట్టు తాజా సమాచారం. అంటే ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిజల్ట్ ని బట్టే దేవ కట్టా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయని అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news