ఇయర్ ఫోన్స్ లేకుండా జర్నీ చేయలేం. చుట్టూ ఎంతమంది ఉన్నా..మనకు మన ఫోనే పెద్ద టైం పాస్. విట్ ఔట్ ఫోన్ అసలు లైఫ్ ఇప్పుడు ఊహించుకోలేమేమో కదా. అందులో ఎక్కువ ట్రైన్, బస్ జర్నీల్లో అయితే. అదేంటో.. జర్నీలో ఫోన్ చార్జిగ్ ఇట్టే అయిపోతుంది. పవర్ బ్యాంక్ ఉంటే ఇక దాంతో చార్జింగ్ పెట్టేయోచ్చు. కానీ కొన్నిసార్లు పవర్ బ్యాంక్ ఉన్నా తీసుకెళ్లటం మర్చిపోతాం, ఒక్కోసారి ఇంట్లో ఈ పవర్ బ్యాంక్ కి చార్జిగ్ పెట్టాలన్నా విషయం కూడా మర్చిపోయి తీసుకెళ్తాం. ఏది ఏమైనా వెరసి జర్నీలో ఫోన్ చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఇలా చార్జింగ్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ ఇప్పుడు చూద్దాం.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుగా చార్జింగ్ సాకెట్ ఉంటుంది. మెట్రో ట్రైన్స్ లో ఛార్జింగ్ పెడితే ఫోన్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల ఫోన్ హ్యాక్ అవుతుందట. ట్రైన్స్ మెట్రోలో యుఎస్బీ కనెక్టర్ తో మనం చార్జింగ్ పెడుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మన ఫోన్లో ఉండే డేటాని హ్యాకర్స్ దృష్టిలో పడే అవకాశం ఉంది.
అంతేకాక మనం మాములుగా ఉపయోగించేది 230v AC కరెంట్. కానీ ట్రైన్ లో వచ్చే సప్లై 110v DC కరెంట్. దీని వల్ల ఒకోసారి చార్జర్, ఇంకోసారి ఫోన్ పాడయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే వీలైనంత వరకు మెట్రో లో కానీ ట్రైన్స్ లో కానీ ఛార్జింగ్ పెట్టడం తగ్గించాలి. ఏం అవుతుందిలే అనుకుని..చార్జింగ్ కాస్త తక్కువున్నా సరే పెట్టేస్తుంటారు. ఒక్కోసారి చార్జింగ్ పెట్టి కాస్త పరధ్యానంగా ఉంటే..ఎవరైనా తీసే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కోకల్లలు. అత్యవసం అయితే తప్ప ఫోనులో చార్జిగ్ అయిపోయినా పబ్లిక్ ప్లేస్లో చార్జింగ్ పెట్టకపోవడమే బెటర్. ఇక తప్పదు వేరే ఆప్షన్ లేదంటే.. నెట్ ఆఫ్ చేసి పెడితే కాస్త బెటర్ అంతే.
-Triveni Buskarowthu