స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులు నవంబర్ 30లోగా తమ ఫోన్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్ కి జత చేయకపోతే ఆన్ లైన్ సేవలను డిసెంబర్ 1 నుంచి నిలిపివేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలు ప్రకారం, మొబైల్ నంబరు నమోదు చేసుకోని వారు, ఇప్పుడు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. ఇందుకోసం తన ఖాతా ఉన్న బ్యాంక్ శాఖకే కాదు.. వివిధ ప్రాంతాల్లోని ఎస్‌బీఐకి చెందిన ఏ శాఖకు అయినా వెళ్లి నమోదు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ సౌకర్యం ఉన్న వారు సరిచూసుకోండి…
ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగిస్తున్నవారు మొబైల్ నెంబరు నమోదైందా, లేదా అనేది పరిశీలించుకోవచ్చు. onlinesbi.com వెబ్‌సైట్‌కి వెళ్లి, బ్యాంకింగ్ లాగిన్, పాస్‌వర్డ్‌తో ఓపెన్ చేయాలి. మై అకౌంట్స్‌లో, ప్రొఫైల్‌ను క్లిక్ చేస్తే, గతంలో మీ ప్రొఫైల్ పాస్ వర్డ్ ని అడుగుతోంది. దీంతో మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీలు నమోదై ఉంటే కనపడతాయి. లేకపోతే మాత్రం సమీప బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.