‘నా ఓటు’ లోగోను రూపొందించిన వారికి 15000 పారితోషకం: ఆమ్రపాలి

-

15000 will be given who designs naa vote logo says amrapali

నా ఓటు లోగో ఏంది అంటారా? తెలంగాణలో వచ్చే నెల 7 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కదా. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల సౌకర్యార్థం నా ఓటు అనే యాప్ ను డిజైన్ చేసింది. ఈ యాప్ లో ఓటర్ల జాబితాను చూసుకోవచ్చు. ఓటరు పేరు, పోలింగ్ కేంద్రం లాంటి వివరాలన్నీ ఉంటాయి. పోలింగ్ కేంద్రం రూట్ మ్యాప్, ఇతర వివరాలు కూడా ఉంటాయి ఇందులో.

ఈ యాప్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను రాష్ట్ర ఎన్నికల సంయుక్తాధికారి ఆమ్రపాలి వెల్లడించారు. ఈ యాప్ లోగో కోసం పోటీలు నిర్వహిస్తున్నారట. సో.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ కు లోగోలు క్రియేట్ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని.. ఎంపికైన లోగోలకు రూ. 15 వేలు పారితోషకం ఇస్తున్నట్టు ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news