లాక్ డౌన్ మీద ప్రధాని మోదీ కీలక ప్రకటన !

Join Our Community
follow manalokam on social media

దేశంలో రెండవ వేవ్ కరోనా వైరస్ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో కోవిడ్ -19 నివారణా మార్గాల గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు.  ఇప్పటికే కరోనా నేపధ్యంలో అనేక రాష్ట్రాలు / యుటిలు కేసులను అదుపు చేయడానికి లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల వారు రాత్రి కర్ఫ్యూలు మరియు వారాంతపు లాక్‌డౌన్లను కూడా విధించారు, ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా హాట్‌స్పాట్ రాష్ట్రాల నుండి వస్తున్నా ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు.

modi
modi

ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఈ సీజన్ లో మనం మొదటి వేవ్ యొక్క పరిమితులను దాటామని మోడీ పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం … ముఖ్యంగా ప్రజలు దీనిని తేలికగా తీసుకుంటున్నారని, కొన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేసే వారి నిబద్ధత లోపించిందని అన్నారు. ఇంతకుముందు మహమ్మారిని ఎదుర్కోవటానికి మనకు మౌలిక సదుపాయాలు లేవు అందుకే మనం లాక్‌ డౌన్‌ను ఒక సాధనంగా ఉపయోగించాల్సి వచ్చింది … కానీ ఈ రోజు మనకు లాక్‌డౌన్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. నైట్ కర్ఫ్యూ పెడితే సరిపోతుందన్న ఆయన దీనిని నైట్ కర్ఫ్యూ అని పిలవడానికి బదులు మనం దానిని “కరోనా కర్ఫ్యూ” అని పిలవాలని అన్నారు. 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...