ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ హక్కులని కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది: మోడీ

-

ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు హక్కుల్ని రహస్యంగా లాక్కోడానికి కాంగ్రెస్ చూస్తోందని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. ఆగ్రా లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల హక్కుల్ని రహస్యంగా దోచుకుందని ఆ తర్వాత దేశంలో తాము అధికారంలోకి వచ్చిన ప్రతి చోట ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు తో కూడా అదే పని చేయాలని చూస్తోందన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రి ముస్లిం కులాన్నిటిని ఓబీసీలుగా మార్చేసి ఓబీసీల హక్కుల్ని దోచుకుంది. దేశంలో ఎక్కడా అవకాశం దొరికిన అదే పని చేయాలనుకుంటుంది యూపీలో ఇదే తరహా కోసం ప్రయత్నాలు చేస్తోంది అని అన్నారు అక్రమ మార్గంలో ఓబిసి ఎస్సి, ఎస్టి ల రిజర్వేషన్లు కోత విధించి వారి హక్కులని దోచుకోవాలనుకుంటున్నారని మోడీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news