విడుదల రజిని కిడ్నాప్…నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వ్యక్తులు

-

విడుదల రజని కిడ్నాప్ కి గురయ్యారు.అవును మీరు చదువుతున్నది నిజమే. కిడ్నాప్ గురయింది నిజంగా విడుదల రజని అనే పేరున్న మహిళే.ఏపీలో నామినేషన్లు చివరి రోజుకి చేరుకున్న నేపథ్యంలో విడుదల రజని అనూహ్యంగా కిడ్నాప్ కావడం ఆందోళన కలిగిస్తోంది.ఈ ఊహించని సంఘటన సంచలనంగా మారింది. చివరిరోజు నామినేషన్ వేయడానికి వస్తున్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. గుంటూరు జిల్లాలో ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపింది.ఇంతకీ ఆమెను ఎవరు కిడ్నాప్ చేసుంటారు.. ? అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలు గుంటూరు జిల్లా వాసుల్లో మెదులుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో విడుదల రజని అనే పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితమే. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విడుదల రజిని..ఈసారి ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి బరిలో దిగుతున్నారు. అయితే విడుదల రజిని పేరున్న మరో మహిళ సైతం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమైంది.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విడుదల రజిని అనే మహిళ కిడ్నాప్ కావడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నామినేషన్‌కు గురువారం చివరి రోజు కావడంతో నేతలందరూ కూడా ఆర్వో కార్యలయాలకు క్యూ కట్టారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు.

నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థి విడుదల రజినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉన్న ఆమెను అక్కడి నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా కొందరు వ్యక్తులు తీసుకెళ్లారు. ఆ మహిళను ఎవరు కిడ్నాప్ చేశారు అనేది అంటుపట్టడం లేదు. కాగా వైసీపీ అభ్యర్థి మంత్రి విడుదల రజని…ఈ విషయం తెలుసుకుని కాస్త నవ్వుకున్నారు. అయితే ఆ కిడ్నాప్ కి గురైన మహిళ కోసం గాలించాలని స్వయంగా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి మంత్రి విడుదల రజని కిడ్నాప్ కావడం ఏంటని చర్చించుకున్న జనాలు అసలు విషయం తెలిశాక అవాక్కయ్యారు. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వైసీపీ లక్ష్యంగా వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ కిడ్నాప్ ఉదంతం కూడా వారి పనే అయి ఉంటుందని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news