కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మూడు నగరాల్లో ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా దాదాపు 1300 టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయని, రోజుకు 5లక్షలకుపైగా నమూనాలు పరీక్షిస్తున్నట్లు చెప్పారు.
కోల్కతా, నోయిడా, ముంబయిలో ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన మూడు కొవిడ్ టెస్టింగ్ కేంద్రాలను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తులో ఈ కేంద్రాలను హెపటైటిస్ బీ, సీ, హెచ్ఐవీ, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించేలా విస్తరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 11వేల కొవిడ్ సహాయ శిబిరాలు ఉన్నట్లు మోదీ చెప్పారు. ఇప్పటి వరకు 1300 కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రోజుకు 5లక్షల మందికిపైగా నమూనాలను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.