ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. దేశ ప్రజలను ఉద్దేశి ఆయన ప్రసంగించారు. కరోనా అంతం తర్వాత కొత్త ఇండియాను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కరోనా వారియర్స్ అయిన వైద్యుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేసారు. కరోనాపై దేశ ప్రజలు అందరూ యుద్ధం చేస్తున్నారని, కరోనా పోరాటంలో ప్రతీ ఒక్కరు సైనికుడే అన్నారు.
కరోనా పై పోరాటానికి అందరూ నాయకత్వం వహిస్తున్నాం అన్నారు. కరోనా వారియర్స్ కి సహకరిద్దాం అని మోడీ విజ్ఞప్తి చేసారు. ప్రజలు ఎవరూ కూడా ఆకలి తో ఉండవద్దు అని రైతులు కష్టపడుతున్నారని అన్నారు. లాక్ డౌన్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు చక్కగా అమలు అవుతుందని అన్నారు ఆయన. దేశం అంతా ఒకే లక్ష్యం తో ముందుకు వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యుద్దంలో ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు.
కరోనా వారియర్స్ మీద యుద్ధం చేస్తే ప్రత్యేక చట్టం ద్వారా శిక్షిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. శానిటేషన్ వర్కర్లు, పోలీసులకు దేశం సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. రైల్వే సిబ్బంది సేవలు ప్రసంశ నీయమని అన్నారు. కరోనా పై మన సరైన రీతిలో యుద్ధం చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. దేశం కోసం సేవ చేయండని ఆయన విజ్ఞప్తి చేసారు. కరోనా రహిత భారత్ కోసం వైద్యులు కష్టపడుతున్నారని అన్నారు. ప్రజలు అందరూ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నారని ఆయన అభినందించారు.