ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా ఈ ఫోన్ సంభాషణలో జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నా స్నేహితుడు ఇజ్రాయల్ ప్రధానితో మాట్లాడారు. కరోనా వైరస్ గురించి మేము ఇద్దరం చర్చించాం అని పేర్కొన్నాడు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో భారతదేశం- ఇజ్రాయెల్ సహకారం గురించి చర్చించామని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయం, నీరు మరియు ఆవిష్కరణ వంటి ఇతర రంగాలలో మా కార్యక్రమాలను కూడా సమీక్షించామని చెప్పారు. కాగా వ్యాక్సిన్ తయారీలో ఇజ్రాయిల్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే.