కొత్త ఏడాదికి మోడీ సర్కార్ తీపికబురు..!

-

మోడీ సర్కార్ ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. చాలా మంది ఈ స్కీమ్స్ లో ఉండి లాభాలని కూడా పొందుతున్నారు. అయితే ఈ కొత్త ఏడాది చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మారుస్తున్నట్టు తెలుస్తోంది.

దీనితో ఈ స్కీమ్ లో డబ్బులు పెడుతున్న వాళ్లకి ప్లస్ అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2022-23 నాల్గవ త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మారుస్తోంది. కాబట్టి సుకన్య సమృద్ధి యోజన ఎన్‌ఎస్‌సీ మరియు పీపీఎఫ్‌ వడ్డీ రేట్ల లో మార్పు రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఐదవ సరి రేపో రేటు ని పెంచనుంది.

4 శాతం నుంచి 6.25 శాతానికి దీన్ని పెంచారు. అయితే ఈ ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మాత్రం పెంచలేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీని ఇస్తోంది. అలానే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కి అయితే 6.8 శాతం ఇస్తోంది. ఇదిలా ఉంటే సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ అలానే కేంద్రం ఇస్తోంది.

అయితే రెపో రేటును 2.25 శాతం ఇప్పుడు పెంచితే ఈ స్కీమ్స్ వడ్డీ కూడా పెరగొచ్చు. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును మూడవ త్రైమాసికంలో 7 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై అయితే ఈ వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version