రైతులకి కేంద్రం శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు పెంచనున్నారా..?

-

రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. చాలా మంది రైతులు కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అయితే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యడానికి ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకోనుంది. రైతులని ఆదుకోవడానికి కేంద్రం చూస్తోంది. ప్రజలు చాలా అసలు పెట్టుకున్నారు. వాస్తవానికి, ద్రవ్యోల్బణం కొత్త రికార్డుల మీదన ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు.

మీరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలని పొందుతున్నట్టయితే ఈ బెనిఫిట్ ని మీరు కూడా పొందవచ్చు. ప్రతీ సంవత్సరం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6,000 వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మార్పు రానున్నట్టు.. డబ్బులు పెంచుతున్నట్టు తెలుస్తోంది.

సాధారణ బడ్జెట్ 2022లో కూడా, కిసాన్ యోజన వాయిదా మొత్తాన్ని పెంచాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ డబ్బులని 6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచనున్నారు. ఏడాదికి 4 విడతలుగా 2 వేల రూపాయల చొప్పున ఇవ్వ వచ్చని చర్చ సాగుతోంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇప్పటి వరకు 12 విడతలుగా రైతుల అకౌంట్ లో పడ్డాయి. ఇప్పుడు 13వ విడత డబ్బులు రైతులు అకౌంట్ లో పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version