కాంగ్రెస్ టెక్ హబ్ ని ట్యాంకర్ హబ్ గా మార్చింది.. మోడీ సెటైర్..!

-

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా దోపిడీ ముఠాని నడుపుతోందని మోడీ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు మోడీ మాట్లాడుతూ బెంగళూరులో నీటి సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ టెక్ హాఫ్ గా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన కర్ణాటక అని కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకర్ హబ్ గా మార్చిందని అన్నారు. 26 కుంభకోణాలతో జేబులను నింపుకోవాలని కాంగ్రెస్ పాలకులు కలలు కంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్కువ టైం లోనే కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేశారు కనీసం వారి ఎమ్మెల్యేలకి అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు సమకూర్చలేదని మోడీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ దిగజారి పోయిందని మోడీ అన్నారు. టాంకర్ మాఫియా నగరంలో నీటిని కొనాలన్నా విపరీతంగా ధరలని పెంచారని ఈ గడ్డు పరిస్థితిని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకని ఏటీఎం గా మార్చేసింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news