ఇది పక్కా… మళ్లీ వైసీపీ గెలవడం ఖాయం…మెజార్టీలతో సహా మరో సర్వే సంచలనం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేప‌థ్యంలో ప్రజా నాడి వైసీపీకి అనుకూలంగా వస్తోంది.దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అందించే టైమ్స్ నౌ మరోసారి ప్రజానాడి గుట్టు విప్పేందుకు ప్రయత్నించింది. ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 149 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోనుందని ఏఎల్ఎన్ సర్వే కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.టీడీపీ కూట‌మి ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూలంగా లేర‌ని స్ప‌ష్టం చేసింది.ఈ స‌ర్వే ప్ర‌స్తుతం ఏపీలో సంచ‌ల‌నంగా మారింది.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రోసారి తాజా రాజకీయ పరిణామాలపై ఏఎల్ఎన్ సంస్థ సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే నివేదికను బ‌ట్టి చూస్తే వైసీపీ 51శాతం ఓటు షేర్ ని పొందనుందని తేల్చిండి. ఇక టీడీపీ 41శాతం షేరుతో రెండో స్థానంలో ఉంటే ఇండియా కూటమి కేవలం 4 శాతం మాత్రమే ఓటు షేర్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏఎల్ఎన్ సర్వే సంస్థ కూడా మళ్లీ వైసీపీకే పట్టం కట్టింది.ఈ సర్వే ఓట్ల మెజారిటీలను అంచనా వేస్తోంది. వైసీపీ గెలిచే స్థానాల్లో 79 మంది 10వేల కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారని స్పష్టం చేసింది. 5 నుంచి 10 వేల మెజారిటీ 57 సీట్లలో, 5వేల వరకు 13 ఎమ్మెల్యే సీట్లలో మెజారిటీలు వస్తాయని చెప్తోంది ఈ సర్వే. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేల్లో కేవలం సీట్ల మెజారిటీ మాత్రమే వెల్లడిస్తే ఏఎల్ఎన్ సర్వే మాత్రం మెజారిటీలను కూడా ఒక అంచనాతో లెక్కగట్టింది.ఈ సర్వేల ప్రకారం చూస్తే వైసీపీకి 2024 ఎన్నికల్లో తిరుగులేదనిపిస్తోంది.

2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన పట్టును నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తున్న‌ట్లు ఏఎల్ఎన్ సర్వే తేల్చేసింది. ఎన్‌డిఏ కూట‌మి చెప్పిన‌ట్లుగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ స‌ర్వే. అయితే తాజా ఫలితాలతో ఎన్డీయే కూటమికి కునుకు పట్టడం లేదు. అలాగే మ‌రో ప‌ది సంస్త‌లు ఇదివ‌ర‌కు వెల్ల‌డించిన స‌ర్వేల్లో కూడా వైసీపీకి అనుకూలంగా ఫ‌లితాలు రావ‌డం విశేషం.ఏ సర్వే ఫలితాలను చూసినా వైసీపీ గెలుతుందని ఘంటాపథంగా చెప్తున్నాయి.దీంతో వైసీపీ శ్రేణులు మరింత దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news