వ్యాక్సిన్ వచ్చేదాకా లైట్ తీసుకోవద్దు !

ఈ రోజు మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు అంటే ఇంకేముంది వైరస్ ఒచ్చేసింది అనుకున్నారు అంతా. కానీ ఆయన ప్రసంగంలో ఆ ఊసే లేదు. స్థూలంగా ఆయన ప్రసంగంలో ఏముందనేది చూద్దాం. కరోనాతో జరిగిన పోరాటంలో, భారత ప్రజలు జనతా కర్ఫ్యూ నుంచి ఈ రోజు వరకు చాలా దూరం వచ్చారని, అయితే ఎవరి బాధ్యతలు నెరవేర్చడానికి, జీవితాన్ని మళ్ళీ వగాడిలో పెట్టడానికి మనలో చాలా మంది ప్రతిరోజూ ఇళ్ళ నుంచి బయటికి వస్తున్నారని అన్నారు.

పండుగల సీజన్ వల్ల నెమ్మదిగా మార్కెట్లు కూడా తిరిగి కోలాహలం గా మారిపోతున్నాయని, అయితే లాక్ డౌన్ అయిపోయినప్పటికీ, వైరస్ పోలేదని మనం మర్చిపోకూడదని అన్నారు. ఇది నిర్లక్ష్యంగా ఉండవలసిన సమయం కాదన్న అయన కరోనా పోయిందని అనుకోవాల్సిన సమయం కాదని అన్నారు. మీరు నిర్లక్ష్యంగా ఉంటే, మాస్క్ లేకుండా బయటకు వస్తే, మీరే, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ ఇంట్లో వృద్ధులకు రిస్క్ కలిగిస్తున్నారని అన్నారు. విజయం సాధించే వరకు, నిర్లక్ష్యంగా ఉండకండన్న ఆయన ఈ వ్యాధికి వ్యాక్సిన్ వచ్చేవరకు మన పోరాటాన్ని సడలించరాదని అన్నారు.