కనిపించని శతృవుతో పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. జాతినుద్దేశించి ప్రధాని వ్యాఖ్యలు.

-

కరోనా సెకండ్ వేవ్ పై చేస్తున్న పోరాటం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇందులో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలతో పాటు గడిచిన వందేళ్ళలో ఇదే అతిపెద్ద మహమ్మారి అని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారితో పోరాడేందుకు ఇతర దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయని, ఆక్సిజన్ లోటును తీర్చుకున్నామని, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంచి ప్రియమైన వారిని పోగొట్టుకున్నామని అన్నారు.

ఇంకా గతంతో పోలిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగిందని, మిషన్ ఇంధ్రధనుష్ పేరుతో వ్యాక్సిన్ల ఉత్పత్తి బాగా పెరిగిందని, దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్లతో పాటు ఇతర దేశాల వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామని, అవసరమైన మందుల ఉత్పత్తులు పెంచడంతో కరోనాపై పోరాటంలో ముందున్నామని, కనిపించని శతృవుతో పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు బాగా తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Latest news