గుడ్ న్యూస్ : వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా కరోనా పరిస్థితులపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం అని.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. కరోనా వల్ల దేశ ప్రజలు ఎంతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక యుగంలో ఇలాంటి మహమ్మారి ఏనాడు రాలేదన్నారు. కరోనాను అంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. అంతే కాదు ఇక నుంచి కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్ ప్రక్రియ ఉండనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ అని.. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేందని గుర్తు చేశారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చుతున్నామని తెలిపారు. ఆధునిక కాలంలో ఇలాంటి మహ విపత్తు ఎప్పుడూ రాలేదని గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అని వెల్లడించారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 కోట్లకు మించి పెంచామనీ… అతి తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రేట్లకు మించి పెంచామని అన్నారు. ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ ఎలా చేస్తారని ప్రపంచం భావించిందని స్వదేశీ సంస్థల ఉత్పత్తితో ప్రపంచానికి మన శక్తి ఏంటో చూపించామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news