కొత్త పార్లమెంట్ కి డిసెంబర్ లో మోడీ పునాది…?

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం కట్టాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ కొత్త భవనానికి పునాది రాయిని ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ మొదటి వారంలో వేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. పాత కాంప్లెక్స్‌ కు దూరంగా నిర్మాణ పనులు ప్రారంభమైన 21 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10 న ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేయవచ్చని జాతీయ మీడియా పేర్కొంది.Construction bids for new Parliament to close on July 14, work to begin after winter session - india news - Hindustan Times

అయితే మోడీ అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి తేదీ ఆధారపడి ఉంటుంది అంటున్నారు. కొత్త పార్లమెంటు భవనంలో ఎంపీలందరికీ ప్రత్యేక కార్యాలయాలు ఉంటాయి. వీటిలో ‘పేపర్‌లెస్ కార్యాలయాలు’ నిర్మిస్తున్నారు. లక్ష్యంతో టెక్నాలజీ ఇంటర్‌ ఫేస్‌ లు ఉంటాయని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ హాల్, ఎంపీల లాంజ్, బహుళ కమిటీ గదులు, భోజన ప్రదేశాలు, పార్కింగ్ స్థలం మరియు లైబ్రరీ కూడా ఉంటాయి.