టాలీవుడ్ కలెక్షన్ కింగ్ సినిమా స్టార్ట్..?

-

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఇప్పటివరకు 560 సినిమాలకు పైగా నటించిన మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మోహన్ బాబు చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు అన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మోహన్ బాబు అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలే మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే దేశభక్తి కథాంశంతో కూడిన ఒక సినిమాను హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించినట్లు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక ఈ సినిమా ప్రారంభ కార్యక్రమంలో మంచు లక్ష్మి, మంచు విష్ణు పాల్గొన్నారు. ఇక ఈ సినిమాని డైమండ్ రత్నబాబు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news