భద్రాచలంలో బూజు పట్టిన ప్రసాదం విక్రయం

-

తీర్థయాత్రలో భాగంగా భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. రామయ్యను దర్శించుకున్న తర్వాత విద్యార్థులంతా కౌంటర్‌లో రూ.25 విలువ గల లడ్డూలను కొన్నారు. వీటి రుచిలో తేడా కనిపించింది. వాటి పైభాగంలో బూజు పట్టడంతో పాటు నల్లటి మచ్చలున్నాయి. ఇంకొన్ని దుర్వాసన వచ్చాయి.

ఈ క్రమంలో బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున్నారని కౌంటర్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు లడ్డూల విక్రయాన్ని నిలిపివేసి.. పులిహోర మాత్రమే అమ్మారు. కౌంటర్లతో పాటు తయారీ కేంద్రాన్ని ఈవో శివాజీ తనిఖీ చేశారు. కొన్ని లడ్డూలు పాడైపోవడంతో కౌంటర్ల నుంచి వెనక్కి పంపించామని, మిగిలిన వాటితో పాటు తాజాగా తయారు చేసినవాటిని విక్రయిస్తున్నామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనుకున్న స్థాయిలో అమ్ముడుపోకపోవడంతో 20 వేల లడ్డూలు మిగిలిపోయాయని చెప్పారు. బూజు పట్టిన లడ్డూల విక్రయంపై విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news