వారి అకౌంట్ లో ప్రతీ నెలా డబ్బులు.. వివరాలు ఇవే..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే ఈ స్కీమ్స్ వలన ఆర్ధికంగా సహాయం అందుతుంది. అయితే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్న వారికి పీఎం సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ రంగంలో కార్మికులకు ఎలాంటి ప్రీమియం చెల్లించక్కర్లేదు.

ఏదైనా ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వత వికలాంగులైతే రూ.2 లక్షల బీమా, పాక్షికంగా వికలాంగులైతే రూ.లక్షను ప్రభుత్వం ఇస్తోంది. ఈ పోర్టల్ లో రిజిస్టర్ అయితే మంచిగా లాభాలని పొందొచ్చు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలకు ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకుంటే యోగి ప్రభుత్వం నెలకు రూ.500 ను ఇస్తోంది. మార్చి 2022 వరకు ప్రజల అకౌంట్లోకి వీటిని ఇస్తామని అన్నారు.

3 కోట్లకు పైగా అసంఘటిత వర్కర్లు రాష్ట్రంలో ఉన్నారని యోగి ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది శ్రామికులు ఇప్పటి వరకు ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 38 కోట్ల మంది వరకు కార్మికులున్నారు. పేర్లని నమోదు చేసుకోవాలంటే కామన్ సర్వీసు సెంటర్‌కు వెళ్లి ఎప్పుడైనా కార్మికులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోచ్చు.

రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించకర్లేదు. అలానే పిల్లల చదువుకు కూడా ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి దీనిలో రిజిస్టర్ చేసుకోచ్చు. ఆధార్ కార్డు, ఆధార్ తో లింకైన మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది.

యూఏఎన్ నెంబర్‌తో ఈ-శ్రమ్ కార్డును జారీ చేస్తారు. రిజిస్టర్ అవ్వడానికి కామన్ సర్వీసు సెంటర్లు, స్టేట్ సేవా కేంద్రాలు, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్దకి వెళ్ళచ్చు. 14434 టోల్ ఫ్రీ నెంబర్‌ తో డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news