5 రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్రం ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోంది. నిన్న కేంద్రవైద్యారోగ్య శాఖ అధికారులతో దేశంలో కోవిడ్ పరిస్థితుల గురించి సమీక్షించింది. ముఖ్యంగా ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా, ఓమిక్రాన్ పరిస్థితుల గురించి చర్చించింది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఎంత వరకు వచ్చిందనే విషయాలను అడిగి కనుక్కుంది.
అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో ఎన్నిక సన్నద్ధతను పరిశీలించనుంది. సకాలంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. దీని కోసం 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది.
ఇదిలా ఉంటే అలహాబాద్ హైకోర్ట్ బేంజ్ ఎన్నికలను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేాయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. మూడో వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో ఎన్నికల సభలు, ర్యాలీను నిషేధించాలని.. పోల్ ప్యానెల్, ప్రభుత్వాన్ని కోరింది.