ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేది చెప్పలేము. మార్చి నెలలో ఈ రాశుల వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది అని జ్యోతిష్య నిపుణులు ఈ విషయాలను చెప్పారు. అయితే కొన్ని రాశులు వాళ్లకి మార్చి నెల లో ఇబ్బందులు ఉంటే మరి కొంత మందికి ధన లాభం కలుగుతుంది.
అయితే మరి ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం.
సింహ రాశి:
సింహ రాశి వాళ్ళకి మార్చి నెలలో ధనలాభం కలుగుతుంది. వ్యాపార పరంగా కూడా విజయం సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి రాహువు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల ఆగిపోయిన ధనం వస్తుంది.
మిధున రాశి:
మిధున రాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. సూర్యుడు 9 వ పాదం లో ఉండడం వల్ల ధన లాభం లభిస్తుంది. అలానే రాహువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది.
మీన రాశి:
మార్చి నెల ప్రారంభం నుండి కూడా ఈ రాశి వాళ్ళకి బాగా ఉంది. వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది అలానే ఖర్చులు అదుపులో ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కూడా మార్చి నెల బాగుంటుంది. గతం లో ఆగిపోయిన డబ్బులు కూడా ఇప్పుడు వస్తాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. దేవ గురువు బృహస్పతి కారణంగా నష్టపోయిన వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. మంచిగా లాభాలు కూడా వస్తాయి.