తెలంగాణకు షాక్.. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ లేనట్టే…

-

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేనట్టే అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే మేధా సర్వీస్ సిస్టమ్ కి పెద్ద ఆర్డర్ ఇచ్చామని.. అయితే కాజీపేటలో భూ కేటాయింపు లేట్ అయినట్లు ఆయన అన్నారు. కాజీపేటలో పిరియాడిక్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని.. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు చేపడుతాం అని ఆయన అన్నారు. 

యూపీఏ ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేసిందని.. కేవలం ఏడాదికి రూ.886 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. 2014 నుంచి తెలంగాణకు నిధులను మోదీ ప్రభుత్వం పెంచిందని ఆయన అన్నారు. 2022-23 లో 3048 కోట్లు తెలంగాణకు కేంద్రం కేటాయించినట్లు వెల్లడించారు. 2009-14 ఒక్క లైన్ కూడా తెలంగాణలో డబ్లింగ్ కాలేదని..విమర్శించారు. ఎంఎంటీఎస్ కి రాష్ట్ర ప్రభుత్వం రూ.631 కోట్ల వాటాను చెల్లించాల్సి ఉందని… కానీ చెల్లించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాధాన్యత పట్టించుకోవడం లేదని విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news