పేదల ప్రధాని పుట్టింది ఫిబ్రవరి 29…!

-

మొరార్జీ దేశాయి… మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చనిపోయేనాటికి ఆయనకు 68 ఏళ్ళు. అప్పుడే ప్రధాని కావలసినవారు, 13 ఏళ్ళ తర్వాత 1977లో అయ్యారు. ఇండియాలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి సారథి. మహా మొండి మనిషి. ఆర్థికవేత్త. ఇందిరాగాంధీ హయాంలో ధరల అదుపు ఉండేది కాదు. ప్రతి నిత్యవసరం రేషన్ షాపులద్వారా తీర్చి, బీదల పెన్నిధిగా ప్రచారం పొందేది ఇందిరా గాంధీ.

గరీబీ హటావో నినాదమిచ్చి, బీదల బస్తీల్ని కూల్చేసిన ఘనత ఇందిరా గాంధీ ది అంటూ అప్పుడు విపక్షాలు ఆరోపించాయి. ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షాలన్నీ ఒక్కటై జనతా పార్టీగా ఏర్పడ్డాయి. 1977 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, మొరార్జీ దేశాయిని ప్రధానిగా కూర్చోబెట్టాయి. మొరార్జీ హయాంలో ధరలు బాగా దిగొచ్చాయి. కిలో చక్కెర రేషన్ షాపులో 1 రూ. 15 పై.లు.

ఓపెన్ మార్కెట్టులో 1.30 రూ.లు నుంచి 1.50 రూ.ల లోపు. (చౌక దుకాణాల్లో పడిగాపులుపడి రేషన్ తీసుకొస్తే, సినిమాకి డబ్బులిచ్చేవారు. నాబోటివాళ్ళకా ఛాన్స్ పోయింది ఈయనవల్ల.) మొరార్జీ తాను అదికారంలో ఉన్న రెండేళ్ళలో ప్రైవేట్/ విదేశీ పెత్తందారీతనానికి కట్టడి ఆరంభించారు. ఈయన విధించిన షరతులకు తట్టుకోలేక Coca-Cola, IBM ఇండియా నుంచి విరమించుకున్నాయి.

మొరార్జీ ఏమాత్రం తగ్గలేదు. ‘డబుల్ సెవెన్’ పేరుతో దేశీయ కోల ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన దెబ్బకు వ్యాపార వర్గాలు బెంబేలెత్తాయి. “అపన్ క్యా సముఝా, ఉనే క్యా నికలా” అనేసి.. తిరగేసి మరగేసి మళ్ళీ ఇందిరమ్మ పీఠమెక్కేలా సాయపడ్డాయి. ఇంత అరుదైన వ్యక్తి… పుట్టినరోజుకూడా అరుదే. ఫిబ్రవరి 29 (1896). కాని ఆయన పుట్టిన రోజుని నేటి కాంగ్రెసేతర పాలకులు మర్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news