మరింత పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్

-

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ మూవీపై నెగటివ్ టాక్ ప్రభావం మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్ లోనే ఫెయిలైన ఈ చిత్రం.. మండే టెస్ట్ అసలు పాస్ కాలేకపోయిందిమూడో రోజు కంటే నాలుగో రోజు కలెక్షన్లు సగానికి పడిపోయాయి. మంగళవారం నాడు ఉగాది, గురువారం నాడు రంజాన్ హాలిడేస్ ఉండటంతో సినిమా కాస్త కోలుకుంటుందని మేకర్స్ ఆశతో ఉన్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ నాలుగు రోజులు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.23.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ఈ చిత్రం నాలుగో రోజైన సోమవారం కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే రాబట్టింది. నాలుగు రోజులు కలిపి ఇండియాలో సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.14.2 కోట్లుగా ఉండగా.. ఓవర్సీస్ నుంచి మరో రూ.9 కోట్లు వచ్చాయి. సుమారు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి మరి

.

Read more RELATED
Recommended to you

Latest news