ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ మారింది. ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూపి లాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు SIB సేకరించిన పాత డేటాను ధ్వంసం చేసినట్లు సమాచారం. దాదాపు 4 దశాబ్దాల కీలక నిఘా డేటాను ధ్వంసం చేసి మూసీలో వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారడంతో ప్రణీత్ రావు గ్యాంగ్ 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news