జనసేన కి చిరంజీవి భారీ విరాళం

-

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆయన తెలుగుదేశం బిజెపితో కలిసి పొత్తులో ఉన్నారు. పవన్ జనసేన దాదాపు 21 స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలోకి దించింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంకి వెళ్లిన ఆయన అక్కడ ఎండ దెబ్బకు గురయ్యారు. కాసేపు సొమ్మసిల్లిన పరిస్థితిల్లో ఆయన తేరుకున్నాక హైదరాబాద్ వచ్చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈరోజు హైదరాబాద్ కి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి అనే ప్రాంతానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

అక్కడ జరుగుతుండగా మెగాస్టార్ చిరంజీవిని కలిసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అన్నదమ్ములు ఇద్దరూ కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుమారు 5 కోట్ల రూపాయల వరకు మెగాస్టార్ చిరంజీవి జనసేన కోసం విరాళం ఇచ్చారు. ఈ సంద్భర్భంగా అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను.

Read more RELATED
Recommended to you

Latest news