ఎక్కడికి అయినా ప్రయాణం చేసే సమయంలో బస్ రిజర్వేషన్ చేయించుకుంటూ ఉంటాం… రద్దీగా ఉండే బస్సులు అయి ఉండి రిజర్వేషన్ లేకపోతే బస్టాండ్ కి వెళ్లి ఆ బస్సులో ముందు ఎక్కడానికి పోటి పడుతూ ఉంటాం… ఆ సమయంలో చాలా మంది బస్సు ఎక్కడానికి ద్వారం వద్ద ఎగబడుతూ ఉంటారు.
అయితే ముందు బస్సు ఎక్కిన వాళ్లకు లోపలికి వెళ్ళగానే విస్తుపోయే దృశ్యం కనపడుతుంది. ఏ బస్టాండ్ లో అయినా ఏ బస్సులో అయినా సరే ఆ దృశ్యం కనపడుతుంది. హడావుడిగా బస్ ఎక్కలేని పరిస్థితిలో ఉన్న వారు బస్సు అద్దంలో నుంచి జేబులో ఉన్న కర్చీఫ్ వేస్తూ ఉంటారు.హడావుడిగా బస్ ఎక్కిన వాళ్లకు మాత్రం సీటు కరువు అయిపోయింది.
ఆఖర్లో ఎక్కే కర్చీఫ్ వేసే అతను వచ్చి సీటులో కూర్చున్నా… ముందు బస్ ఎక్కిన వాళ్ళు కూర్చునే పరిస్థితి లేక నిలబడే ఉంటారు. పొరపాటున ఎవరైనా ఆ కర్చీఫ్ తీసి కూర్చుంటే మాత్రం అవసరమైతే దాడి చేయడానికి కూడా వెనుకాడరు.ఇలా ఆ కర్చీఫ్ బస్సుల్లో రిజర్వేషన్ మించి పవర్ ఫుల్ అంటూ ఉంటారు ప్రయాణికులు. ఇటీవల ఒక ప్రయాణికుడు తన కర్చీఫ్ తీసి కూర్చున్నాడు అనే కారణంతో తన వద్ద ఉన్న సూట్ కేసుతో దాడి చేసాడు మరో ప్రయాణికుడు. ఇలాంటి దాడులు చాలా ప్రాంతాల్లో చాలా జరుగుతున్నాయ్ కాబట్టి ప్రయాణికులు కర్చీఫ్ తో జాగ్రత్తగా ఉంటె మంచిది అంటున్నారు బాధితులు…!