మార్నింగ్ రాగా : మేడే మార్చ్ .. లాంగ్ లివ్ మా..

-

బాగున్నారా.. ఈ మాట ఎవ‌రిని ఎలా అడ‌గాలి
నాట్ బ్యాడ్ అన్న‌ది ఆన్స‌ర్ దీనిని ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి
ఇవ్వ‌డాన్ని మించిన  గొప్ప‌ద‌నం లేదు ఏంటది
 ప్రేమా..వాత్స‌ల్యం..అనురాగం..అభిమానం
(ఈ లిస్టు పెద్ద‌దే స‌ర్ కాస్త కుదించండి అని అన్నారెవ‌రో)
కానీ ఇవ్వ‌డాన్నిమించినది మ‌రొక‌టి ఉంది పంచేందుకు పొందే అర్హ‌త
అస‌లు దేనిని పంచాలి  శ‌క్తిని కాదు శ్ర‌మ‌ని కాదు ఇంకా ఆనందాన్ని
పంచుతున్నామా మ‌నం.. తెలియదు,..  నాట్ బ్యాడ్..టూ గుడ్
ఏది శాసిస్తుంది..ఉన్న‌చోట ఉండిపోవ‌డం నాట్ బ్యాడ్ ..
ఉన్న‌చోటని ఉన్న‌తీక‌రించ‌డం టూ గుడ్

అన‌గ‌న‌గ‌న‌గా ఓ న‌వ‌ల‌..
ఇప్పుడు అన‌గా  ఓ సినిమా..
ఏంటో చూద్దాం.. కాస్త స‌విస్తారంగా.. ఆలోచిద్దాం..
చ‌దివాక దృక్కుని రుక్కుని వాక్కుని సంస్క‌రిస్తే మేలు
ఎవ‌రు?? మీరు అనే నేను నేను అనే మీరు ..

 

శ్రామికుడి క‌ష్టాన్ని సంఘం ఏర్పాటు వెనుక ఆ..రోజుల్లో ఎదుర్కొన్న తీవ్ర మ‌నోవ్య‌థ‌ని రావూరి భ‌ర‌ ద్వాజ “ఇదం జ‌గ‌త్”లో అక్ష‌రీక‌రించారు. అది ఆ య‌న తొలి న‌వ‌ల‌. పాకుడు రాళ్ల‌లో సినీ జీవుల వ్య‌ థార్థ గాథ‌లు య‌థార్థంగా చెప్పి,వారిపై గౌర‌వం పెంచారు. అది ఆయ‌న‌కు జ్ఞాన్ పీఠ్ అవార్డు తెచ్చిన న‌వ‌ల‌.. శ్రమ నుంచి శ్ర‌మ వ‌ర‌కూ ఎంత‌టి ప‌రిశ్ర‌మ దాగుందో..ఎంత‌టి ప‌ఠిమ దాగుందో..నీవు ఏనాడ‌ యినా గుర్తిం చావా..అన్నారెవ‌రో..!అవును! మ‌నుగడకు ఆధార‌మ‌యిన చెట్టు తల్లిది.. మ‌నుగ‌డే ప‌ర‌ మావ‌ధిగా భా వించే చీమ త‌ల్లిది శ్ర‌మే..మ‌నం ఒక్క‌రేనా శ్ర‌మిస్తున్న‌ది.. అస‌లీ జ‌గ‌త్తుకు శ్ర‌మ వేద ఉ ల్లేఖ‌నలు అం దించింది ఎవ‌రు?? ఎనీవే..ఈ రోజు అమ్మకు తొలి వంద‌నం చెబుదాం..ఆ..త‌ల్లి లేనిదే మ‌నం లేము క‌ దా! క‌నుక త‌ల్లికి తొలి  వందనం.

మాతృత్వం గొప్ప‌ది టూ గుడ్
డాక్ట‌ర్ ప్రెగెన్సీ క‌న్ఫం చేశాక త‌రువాతో/ఆ..త‌రువాతో..
పీరియ‌డ్స్ ఆగిపోయాయి ఇట్స్‌ క్వైట్ నేచుర‌ల్

త‌రువాత నెల‌లు నిండాక నెల‌ల పాపాయికి.. పండంటి బిడ్డ‌కు పాలివ్వ‌డం ప‌ర‌మావ‌ధి.బిడ్డ‌ను సాక‌ డం విహిత క‌ర్త‌వ్యం..ఇలా చాలా మాటలు స్ఫుర‌ణ‌కు తెప్పించారొక‌రు.మాతృత్వాన్ని ఈ రోజు స్మ‌రిం చానా..ఈ రోజే ఆ ఔన్న‌త్యాన్ని గుర్తించానా.రెండంటే రెండు దారు ల్లో జీవితాన్ని నిర్మించాను.ఏంటా దారులు ఒక‌టి స్వ‌ర్గం రెండోది న‌ర‌కం..ప్ర‌స‌వ స‌మ‌యంలో..ఆ..దారి స్ప‌ష్టం.. ప్ర‌స‌వించాక దుఃఖాన్నం తంటినీ ఆ..అయ‌స్కాంత త‌రంగాల్లో(మ్యాగ్నిటిక్ వేవ్స్)లో బంధించాక,పంటి దిగువ భాగాన బాధ‌ని అ దిమి ప‌ట్టి ఉంచాక ఓ బిడ్డ జ‌న‌నం స్వ‌ర్గానికి దారి.క‌నుక తల్లి ఆనందం ఓ దీప ధారి..ఆ.. కాంతుల‌కు ఏం చేయాలి త‌ప్ప‌క మొక్కాలి.

స్వ‌ర్గాలు ఎక్క‌డో లేవు తెల్సు
ఎక్క‌డున్నాయి .. ఆన‌వాలు తెల్సు
ఆమె పాదాల కింద అని ఖురాన్ ఉప‌దేశం
అవును!!మ‌నం గౌర‌వించాలి స్వర్గాన్ని గౌర‌వించ‌డం చిన్న విష‌యం
నిర్మించ‌డం పెద్ద విష‌యం.. ఒక‌టి ట్రూ వెర్స్ ఇంకొక‌టి ట్రాన్స్ వెర్స్
ట్రాన్స్ వెర్స్ ఏంటి ఆమెను గౌర‌విస్తున్నాం అన్న‌ది..

ట్రూ వెర్స్..ఆమెను య‌థాత‌థంగా అంగీక‌రించ‌డం అంటే అంటూ..ముట్టూ ఉన్న‌ప్పుడు కూడా..ప‌చ్చి నిజం ఇది..ఆ..భాష‌లోనే చెప్పాలి. శ్ర‌మ జీవుల భాష‌లోనే మ‌నం రాయాలి.ప‌ట్టం క‌ట్టాలి.క‌ద‌లండి ఆ.. మాతృత్వ మ‌ధురిమ అందించు శిఖర స్థాయి ప్రేమ‌ని అందుకునేందుకు..ఆ ర‌స‌ధునికి జేజే ధ్వ‌నికి జేజే..ఆ..పాదాల‌కు వంద‌నం.వాట్ నాట్ ..వాట్ ఎల్స్‌..

ఎవ‌రో అన్నారు హాలీవుడ్ వాడు ఎలా అయినా హాల్లో ప్రేక్ష‌కుడ్ని కూర్చొండ‌బెడ‌తాడు అని..నిజ‌మే మ‌ నం చాలా సంద‌ర్భాల్లో ప్రేక్షకుడిగానే మిగిలిపోతున్నాం క‌నుక థియేట‌ర్ లో ప్రేక్ష‌కుడిగా కూర్చోవ‌డా న్ని కొన్నిసార్లు అయిష్టంగానే భావిస్తాం.అక్క‌డి అశాంతిని చూస్తే త‌ట్టుకోలేం..చ‌లిమ‌ర గ‌ది మ‌రింత చ‌ ల్లంద‌నాలు పోగేసుకోకుంటే చెమ‌ట్లు పోస్తాం.. మ‌న‌కు కేవ‌లం ఆన్ స్క్కీన్ రొమాన్స్ కావాలి.. స్కిన్టోన్ ..స్క్రీన్టోన్ అదిరిపోవాలి. కానీ ఈ మే నెల‌లో మ‌న ద‌గ్గ‌ర ఎండ‌లు విప‌రీతంగా ఉండే స‌మ‌యాన ఓ చ‌ల్ల‌ ని స‌మీరం రానుంది.కాదు ఓ క‌న్నీటి కెర‌టం పోటెత్త‌నుంది.

అది మాతృత్వ‌పు ఔన్న‌త్యాన్ని దృశ్య‌మా నం చేసిన ప‌ర‌దేశం సినిమా..కాదు ప‌డ‌మ‌టి దేశం సినిమా..స‌గ‌టు ఆడ‌ది క‌ష్టం.. సినిమా పేరు”టా లీ”..ఎంత బాగా చెప్పిందో ఈ సినిమా గురించి ఓ ప్ర‌ముఖ మీడియా..ఆ..రెండ‌క్ష‌రాల మీడియాలో మూడ‌క్ష‌రాల ఫీచ‌ర్ పేజీలో ఒకే మాట రాశారు స్త్రీ త‌ల్లిగా మారాక త‌న‌కు తాను ఏమీ మిగుల్చుకోదు అని..(వాక్యం కొద్దిగా మార్చి చెప్పాను లేండి)..త‌ల్లి కావ‌డం ఓ భౌతికావ‌స‌రం దానిని అర్థం చేసుకోవ డం స‌హ‌క‌రించ‌డం మ‌గ‌పుంగ‌వుడి క‌ర్త‌వ్యం అని ఉద్బోధించింది. చేస్తున్నామా మ‌నం..మ‌నం బాధ్య‌త‌ ల‌ను బ‌రువుల‌ను రెండింటినీ త‌ల‌చి/కొల‌చి తెగ ఇబ్బందిప‌డిపోతున్నాం.. అంత‌కుమించిన బాధ్య‌త  జీవితాన్ని పంచుకున్న‌వారిని  అర్థం చేసుకోవ‌డం క‌దా! ఆ స్వ‌రాన్ని అనున‌యించ‌డం క‌ దా!

ఇది భౌతిక అవ‌స‌రాల‌ను మించిన ప‌ని..ఇష్టంగా చేయాల్సిన ప‌ని.. ఎంత చండశాస‌నుడు అయినా చే యాల్సిన ప‌ని ఆ..స‌మ‌యంలో అన‌గా రుతుక్ర‌మంలో ఎంత చెండాలుడు అయినా ఆ..స‌మ‌యంలో అ న‌గా గ‌ర్భిణిగా త‌న జీవ‌న స‌హ‌చ‌రి ఉన్న‌ప్పుడు చేయాల్సింది స‌ప‌ర్యే.. చేస్తున్నాడా వీడు.అటువం టప్పుడు పురుషుడు పురుషోత్త‌ముడా ఏమో!మెట‌ఫ‌ర్ల‌కేం ఎన్నైనా రాయొచ్చు చెప్ప‌వ‌చ్చు.అన్న‌ట్లు ఈ సినిమా ఓ గ‌ర్భిణీ వేద‌నకు దృశ్య రూపం..ఇందులో రెండు పాత్ర‌లు మ‌నతో మాట్లాడ‌తాయి..అవి కీల‌కం.. కీలకంగా తోచిన‌వి గుర్తించడం బాధ్య‌త‌.

త‌ల్లిగా/చెల్లిగా/భార్యగా చా లా గారాల గ‌మ‌కాల్లో ఆమె ప‌రిచ‌యం కావొచ్చు.ప్రేమ పంచ‌వ‌చ్చు..తిరిగి ఇస్తున్నామా మ‌నం..ఆఖరికి ఆమె లావెక్కిపోయిన స‌మ‌యంలోన యినా స్పందిస్తున్నామా మ‌నం.. గ‌ర్భ‌స్థ శిశువుని మోస్తున్న‌ప్పుడు, ఆఖ‌రికి బిడ్డకు స్త‌న్యం ఇచ్చేట‌ప్పుడు అయినా మ‌న చూపుల‌తో ఆమెను హిం సిస్తున్నాం క‌దా!అప్పుడు ఓపెన్ బ్రెస్ట్ ఫీడ్ సాధ్య‌మా.. లేదండి మేం సంస్కారులం..మేం గౌర‌విస్తాం అస‌లు ఇండియాలో అలాంటివి ఎక్క‌డ జరిగి నా మ‌గువ‌ల‌కు త‌ప్ప‌క అండ‌గా నిలుస్తుందీ స‌మాజం అని ఎవ్వ‌రు అన్నా ఆ..మాట‌లో స‌త్య‌శీ ల‌త‌ను కాస్తో/కూస్తో ఒక ప‌రి చెక్ చేసుకోవాల్సిందే.. సెల్ఫ్ చెక్ ఎంత ముఖ్య‌మో సొసైటీని స్క్రూట్నీ చే సే చెక్ కూడా అంతే అవ‌స‌రం.మ‌నం అవ‌స‌రాల‌ను భౌతికంగా చూసి వ‌దిలేయ‌డం వ‌ల‌న ఆమె అర్థం కాదు..

కానీ..ఇంకొన్ని అభౌతిక అవ‌స‌రాలు ప్రావ‌స్థ‌లు బ‌హిష్టు వేళ‌ల్లో ఉండి ఉండ‌వ‌చ్చు.. గ‌ర్భిణిగా..పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జ‌న‌నిగా ఆమెకు ఉం డే ఇష్టాల‌ను గుర్తిస్తే అన‌వ‌స‌ర రాద్ధాంతాలు ర‌ద్ద‌యి వాటి స్థానే  ప్రేమే ఓ అవ‌స‌రంగా ప‌రిణ‌మించే అవ‌కాశం మెండు.క‌నుక స్త్రీని మించిన గొప్పశ్రమ వేదం ఎక్క‌ డ‌ని..ఆమె టూ గుడ్.. ఆమెని అర్థం చేసుకోక‌పోవ‌డం టూ వ‌రెస్ట్..  ఇంత‌కుమించి ఏమీ చెప్ప‌రాదు. ఆ..స్వేద జ‌ల‌ధికి/ఆ..జ‌న‌నికి..ఆ.. జ‌న్మాంతం జేజేలు ప‌ల‌కండి.త‌ల్లీ నీకు వంద‌నం.అంద‌రికీ మే డే శు భాకాంక్ష‌లు.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Latest news