తల్లి చనిపోయినా విదుల్లోనే పోలీస్…!

-

కరోనా పుణ్యమా అని పోలీసులు తమ కుటుంబాలను, ఆప్తులను వదిలి విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా జీవితం గడుపుతున్నారు. కరోనా మహామ్మారి ఆ విధంగా పోలీసులను ఇబ్బంది పెడుతుంది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రాణాలకు తెగించి పోరాటమే దాదాపుగా వాళ్ళు చేసేది.

ఒక పోలీస్ అయితే కుటుంబానికి దూరంగా విధులు నిర్వహిస్తూ తన తల్లి చనిపోయినా సరే వెళ్ళకుండా అలాగే ఉన్నారు. ఆయన పేరు శాంతారాం… ఆయనది ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్రలోని విజయనగరం… మూడు రోజుల క్రితం శాంతారామ్ తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అక్కడికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలి అంటే కనీసం నాలుగు జిల్లాలు దాటి వెళ్ళాలి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, జిల్లాలు దాటి వెళ్ళాలి.

40 చెక్‌పోస్టులు దాటివెళ్లాలి… ప్రస్తుతం లాక్ డౌన్ ఉంది కాబట్టి ఇది సాధ్యం అయ్యే పని కాదు. దీనితో ఆయన కుటుంబ సభ్యులనే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు. వీడియో కాల్ ద్వారానే తల్లి అంతక్రియలను వీక్షించి కన్నీటి పర్యంతం అయ్యారు. తాను అక్కడికి వెళ్లొచ్చినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని.. అలా జరిగితే విధులకు ఆటంకం కలుగుతుంది అని ఆయన చెప్పి విదుల్లోనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news