ఇప్పుడు కాంతారా దేశ వ్యాప్తంగా దాదాపు అదరికి పరిచయం అయిన సినిమా. కన్నడ లో చిన్న బడ్జెట్ సినిమా గా మొదలయిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిన్న ఇక ఈ సినిమా తీసిన రిషబ్ శెట్టి ఫేమస్ పర్సన్ గా మారాడు.అయితే దర్శకత్వంలోనే కాదు.. నటుడిగానూ ప్రశంసలు అందుకున్న రిషబ్.. తాను సినిమా పరిశ్రమ లోకి రావడానికి పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్ 2022కి ముఖ్య అతిథిగా హాజరయిన తన జీవితం లో జరిగిన స్ట్రగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఈ ఈవెంట్ లో రిషబ్ మాట్లాడుతూ వాస్తవానికి “నేను హీరో కావాలని సినిమా ఫీల్డ్ కు వచ్చాను. నాకు పెద్దగా పరిచయాలు లేకపోవడం. సొంతంగా డబ్బులు పెట్టలేని కుటుంబం కావడంతో మొదట్లో నాకు ఎవరూ నాకు అవకాశం ఇవ్వలేదు. దీనితో నిరాశగా ఉన్న సమయంలొ ఒక స్టార్ హీరో ఇంటర్వ్యూ నాలో ఆశలురేపింది.
తాను ముందు అవకాశాలు రాక అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయి పరిచయాలు నాలెడ్జ్ పెంచుకొని చిన్న చిన్న వేషాలు వేస్తూ చివరకి ఫైనల్ గా హీరో అయ్యాడు. తన లాగే నేను కూడా అంచెలంచలగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను.నాకు మొదట డైరక్టర్ గా అవకాశం ఇచ్చిన రక్షిత్ శెట్టి నాలో నమ్మకం పెరిగేలా చేసాడు. తర్వాత అదే కాన్ఫిడెన్స్ తో దర్శకత్వం మరియు హీరోగా చేస్తూ నా డ్రీమ్ ను నెరవేర్చుకున్నాను అని తన జీవిత కథను అందరికీ చెప్పాడు. ఎంతైనా నేటి తరం కు రిషబ్ శెట్టి ఆదర్శంగా నిలిచారు.