అవతార్ 2 నిడివి చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు..

-

హాలీవుడ్ దర్శకుడు జీన్స్ కెమెరా నుంచి రాబోతున్న మరో అద్భుత కళాఖండం అవతార్ 2 2009లో వచ్చిన అవతారకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిడివి విషయం తాజాగా వైరల్ గా మారుతుంది..

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విజువల్ వండర్ సినిమా ‘అవతార్‌2’. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నీడివి కోసం ప్రస్తుతం పెద్ద రచ్చ జరుగుతుంది.. అవతార్ 2 నిడివి ఎక్కువగా ఉందని అంత సమయం జేమ్స్ కామరూన్ అభిమానుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలడా అనే వార్తలు వినిపిస్తున్నాయి… ‘అవతార్‌2’ నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటలా 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, థియేటర్‌లో ప్రేక్షకుడిని అంత సేపు కూర్చోబెట్టాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి.

అయితే ‘అవతార్2’ రన్‌ టైమ్‌ విషయంలో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ పూర్తి విశ్వాసంతో ఉన్నారట.. 2009లో వచ్చిన మొదటి ‘అవతార్‌’ చిత్రం రన్‌ టైమ్‌ 162 నిమిషాలు. అంటే 2 గంటలా 42 నిమిషాలు మాత్రమే. మొదటి భాగంతో పోలిస్తే, పార్ట్‌2 అదనంగా దాదాపు మరో అరగంట నిడివి పెరిగింది. ‘అవతార్2’కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 3డీ ఐమ్యాక్స్‌, 4డీ అనుభూతి కలిగిన థియేటర్‌లలో సినిమా చూడాలంటే దాదాపు రూ.1000పైనే టికెట్‌ ధర (మెట్రో నగరాల్లో) ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news