Moto E32 కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు

-

మోటోరోలా నుంచి మరో కొత్త E-Series స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అతి త్వరలో మొబైల్ మార్కెట్లోకి Moto E32 కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు మోటోరోలో కంపెనీ సన్నద్దమైంది.. ఎప్పటిలాగే.. లాంచింగ్ ముందే కొత్త ఫోన్ ఫీచర్లు, ధర ఆన్ లైన్‌లో లీకయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!

Moto E32 ఫీచర్లు (అంచనా) :

moto E32 6.6-అంగుళాల FULL HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.
12nm ఆర్కిటెక్చర్‌తో MediaTek Helio G85 ఉండొచ్చు.
స్మార్ట్‌ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు.
Moto E32 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో రానుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. Moto E32 50-MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ స్నాపర్ 2MP మాక్రో లేదా డెప్త్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ధర విషయానికి వస్తే రూ.11వేల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జూన్ 16న ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
2022లో దాదాపు 20 స్మార్ట్ ఫోన్ లాంచడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలను సిద్ధం చేసింది.. ఇందులో భాగంగానే Motorola ఇటీవలే G సిరీస్‌కి G22, G52 మోడల్ ఫోన్లను రిలీజ్ చేసింది. భారత్ సహా ఇతర దేశాల మార్కెట్లో మరో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. అందులో ఒకటి Moto E-Series స్మార్ట్ ఫోన్. ప్రస్తుతం మోటోరోలా కంపెనీ.. Moto E32, Motorola Edge 30ని కూడా లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐరోపా మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది. మోటరోలా ఇటీవలి కాలంలో యూరప్‌లో రిలీజ్ చేసిన అన్ని ఫోన్లను భారత మార్కెట్లోనూ లాంచ్ చేసింది..ఈ కొత్త Moto E32 స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. Moto E32 ఫోన్ మాత్రమే కాకుండా Motorola Edge 30 కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. Motorola Edge 30 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 ప్లస్ ప్రాసెసర్‌తో రానుంది. ఇక ఫోన్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news