మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్లు అదుర్స్.. ధ‌ర త‌క్కువే..!

-

మోటోరోలా కంపెనీ మోటో జి9 పేరిట నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో సోమ‌వారం విడుద‌ల చేసింది. మోటోరోలా జి సిరీస్ లో వ‌చ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూషన్ క‌లిగిన డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 662 అధునాత‌న ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో ఇచ్చారు.

Moto G9 smart phone launched in india

మోటో జి9 స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ మాక్స్ విజ‌న్ డిస్‌ప్లే
* 1600×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌
* 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో ప‌వ‌ర్ చార్జింగ్

మోటో జి9 స్మార్ట్ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్‌, స‌ఫైన్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. రూ.11,499 ధ‌ర‌కు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆగ‌స్టు 31 నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news