జియో నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. ఏడాదిపాటు ఉచితంగా హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌..

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం రెండు నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.499, రూ.777ల‌కు ఈ ప్లాన్లు వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్ల‌లో ఏ ప్లాన్ ను అయినా రీచార్జి చేసుకుంటే ఏడాది పాటు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. అయితే ఈ ఆఫ‌ర్ ను ఏడాది పాటు వాడుకోవాలంటే.. ఆ రెండు ప్లాన్ల‌లో ఏదో ఒక ప్లాన్‌ను ఏడాది పాటు వాడాలి.

jio launched 2 new prepaid plans offers hotstar subscription free for one year

రూ.499 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు ఎలాంటి కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు రావు. కేవ‌లం డేటా మాత్ర‌మే వ‌స్తుంది. అందువ‌ల్ల ఈ ప్లాన్‌ను డేటా యాడాన్ గా జియో అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5 జీబీ డేటా ల‌భిస్తుంది. దీనికి 56 రోజుల వాలిడిటీ ఉంటుంది.

ఇక రూ.777 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. కాగా ఇందులో వినియోగ‌దారుల‌కు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు మ‌రో 5 జీబీ డేటా అద‌నంగా ల‌భిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. కాగా పైన తెలిపిన రెండు ప్లాన్ల‌లో దేన్ని రీచార్జి చేసుకున్నా ఏడాది పాటు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ రెండు ప్లాన్ల‌ను జియో వినియోగ‌దారులు జియో యాప్, వెబ్‌సైట్ ద్వారా పొంద‌వ‌చ్చు. లేదా జియో స్టోర్ లోనూ రీచార్జి చేయించుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news